డోంట్ వర్రీ.. విక్రమ్ విజయాన్ని సాధిస్తుందట.. ఎలా అంటే? (video)
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి వెళ్ళి చేరిన విషయం తెలిసిందే. అయితే ధర్మల్ పోస్టర్ ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు ల్యాండర్ సింగిల్ పీస్‌గానే ఉన్నట్లు గుర్తించారు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
చందమామకు అతి సమీపం వరకు వెళ్ళి సిగ్నల్ లేకుండా పడిపోయిన విక్రమ ల్యాండర్ ఒక శుభవార్తను తీసుకొచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నంత పని చేసింది. రెండు కిలోమీటర్ల ఎత్తు నుంచి చందమామపైన పడిన విక్రమ్ ల్యాండర్ ముక్కలైపోయిందన్న అనుమానం వెంటాడింది.
కానీ అది ఎంతమాత్రం చెక్కుచెదరలేదని ఇస్రో గుర్తించింది. ల్యాండర్ బరువు ప్రజ్ఙాన్ రోవర్‌తో కలిపి 1471 కిలోలు. పడిపోతే పగిలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న కారణంగా మంచి కబురునే మోసకొచ్చింది. అది ఎంత ఎత్తు నుంచి పడిపోయినా ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా పడిన చోటే స్థిరంగా ఉన్నట్లు గుర్తించారు.
పాజిటివ్ అంశాలు ఉండటంతో ల్యాండర్ నుంచి సిగ్నల్స్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ లోపల ప్రజ్ఙాన్ రోవర్ కూడా ఉంది. ఇస్రో చెబుతున్న ప్రకారం ల్యాండర్ క్షేమంగా ఉండటంతో సిగ్నల్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయట. ఒక్కసారి సిగ్నల్స్ అందితే దానికి కావాల్సిన విధంగా సెట్ చేసుకోవడానికి వీలు ఉంటుందట. అంతేకాదు అందులో నుంచి రోవర్‌ను కూడా బయటకు తీసుకురావచ్చట.
నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగానే విక్రమ్ ల్యాండైందట. కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్షకు ప్రతిబింబంగా భావిస్తున్న చంద్రయాన్-2 మొత్తానికి దక్షిణ ధృవాన్ని చేరింది. అయితే మృదువుగా కాకుండా కాస్త హార్డ్‌గా ల్యాండయ్యింది. దీంతో చంద్రుడిపై నిలిచిన నాలుగవ దేశంగా నిలిచింది.
ల్యాండర్ కాలపరిమితి 14 రోజులు. ఇంకా 12 రోజులే సమయం మిగిలి ఉండడంతో శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆర్బిటర్, ల్యాండర్ల మధ్య సమాచార వ్యవస్థను పునరుద్ధరించి, అలాగే విక్రమ్ వ్యవస్థను పునరుద్దరించేలా చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో విక్రమ్ ల్యాండర్ నుంచి పూర్తిస్థాయిలో సంకేతాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు.