జేమ్స్ బాండ్ నటిని కాటేసిన కరోనా, మీరు జాగ్రత్త ప్లీజ్ అంటూ కామెంట్

సోమవారం, 16 మార్చి 2020 (16:31 IST)
జేమ్స్ బాండ్ నటిని కరోనా వైరస్ కాటేసింది. గత వారం రోజులుగా దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతూ రాగా, ఆమె ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఈ నటికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ నటి పేరు ఓల్గా కురిలెంకో. ఉక్రెయిన్ దేశానికి చెందిన మోడల్. జేమ్స్ బాండ్ నటి. తనకు కరోనా సోకిన విషయాన్ని ఓల్గా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. "వారం రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాను. జ్వ‌రం, అల‌స‌ట క‌రోనా ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు. ఈ వైర‌స్‌పై జాగ్ర‌త్త‌గా ఉండండి. దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేదు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 2008లో వ‌చ్చిన జేమ్స్ బాండ్ చిత్రం "క్వాంట‌మ్ ఆఫ్ సోలేక్"‌, 2013లో వ‌చ్చిన "సైంటిఫిక్" చిత్రాల‌తో పాపుల‌ర్ అయింది. 
 
గ‌తవారం హాలీవుడ్ న‌టుడు టామ్ హంక్స్ అత‌ని భార్య రీతా విల్స‌న్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. టామ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని చెప్ప‌డంతో అభిమానులు వారిద్ద‌రు త్వ‌ర‌గా కోలువాల‌ని కోరారు. క‌రోనా రోజురోజుకి తీవ్రంగా మారుతున్న క్ర‌మంలో అన్ని దేశాలు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించాయి. ఇరాన్‌, ఇట‌లీ దేశాల‌లో క‌రోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న విష‌యం తెలిసిందే. 

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments