శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (15:49 IST)

ఎనిమిది కాళ్లతో జన్మించిన దూడ.. తూర్పు గోదావరిలో వింత

lamb
lamb
గోవును గోమాతగా కొలుస్తుంటాం. తాజాగా గోవుకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  వింత చోటుచేసుకుంది. ఒక దూడ ఎనిమిది కాళ్లతో జన్మించింది. దీంతో ఆ దూడను చూసేందుకు భారీగా చుట్టుపక్కల వారు ఎగబడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. గోకవరం మండలం మురళి నగర్‌కు చెందిన ఓ రైతు ఇంట్లో ఈ వింత దూడ జన్మించింది. దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. 
 
ఈ దూడకు రెండు వెన్నెముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ షాకయ్యారు. కాగా దూడను పరీక్షించిన పశు వైద్యులు జన్యుపరమైన లోపం కారణంగా దూడ అలా జన్మించిందన్నారు.