శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (13:41 IST)

ఢిల్లీలో దారుణం... 17ఏళ్ల బాలికపై దుండగుల యాసిడ్ దాడి

crime scene
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ పోసి పారిపోయారు. దాడిలో బాధిత బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన సమయంలో బాధిత బాలిక తన చెల్లిలితో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఉదయం 9 గంటలకు మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ కు ఈ సంఘటన గురించి కాల్ వచ్చిందని డీసీపీ మండవ తెలిపారు. బాలిక తన చెల్లెలితో ఉన్నప్పుడు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై యాసిడ్ లాంటి పదార్థాన్ని పోసి పారిపోయారు. బాలిక ద్వారకాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది.
 
యాసిడ్ దాడి వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.