Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అపార్ట్‌మెంట్ కల్చర్.. బుద్ధి గడ్డి తింటోందా? పార్కింగ్‌కు అడ్డొచ్చాడని బాలుడిని?

Written By సెల్వి
Published: సోమవారం, 11 నవంబరు 2019 (15:40 IST)
అపార్ట్‌మెంట్ల కల్చర్ నగరాల్లో బాగానే పాకుతోంది. అపార్ట్‌మెంట్ల సంస్కృతి కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఎవరికి ఏం జరిగినా పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుపోతున్నారు చాలామంది. వాళ్ల వాళ్ల బతుకులు వాళ్లవి అన్న చందంగా బతుకుతున్న జనాల్లో మానవా దృక్పథం మంటగలిసిపోతుంది. 
 
తాజాగా ఓ మానవ మృగం తన కారు పార్కింగ్ చేస్తుండగా ఆ బాలుడుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. సికింద్రాబాద్ అల్వాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కాంతారావు అనే వ్యక్తి ఓ బాలుడ్ని విచక్షణారహితంగా చావబాదాడు. కారుకు అడ్డంగా వచ్చాడని చిన్నారి అని చూడకుండా పిడిగుద్దులు కురిపించాడు. చిన్నారి మెడ తిప్పడం వంటివి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
 
అయితే... కాంతారావు దెబ్బలకు బెదిరిపోయే... ఒళ్లంతా నొప్పులతో చిన్నారి ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడు తండ్రి కాంతారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు అపార్ట్‌మెంట్ వాసులు కూడా కాంతారావు వైఖరిపై మండిపడుతున్నారు. చిన్నారిని అంతలా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. కాంతారావుపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments