Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోడీ రెడ్డి... వైకాపా అధినేతకు పేరు పెట్టిన లోకేశ్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సరికొత్త పేరు పెట్టారు. ఇకపై జగన్ పేరును ఇకపై జగన్ మోడీ రెడ్డిగా మారిందనీ ఆయన చెప్పారు.

Written By pnr
Updated: శుక్రవారం, 22 జూన్ 2018 (09:31 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సరికొత్త పేరు పెట్టారు. ఇకపై జగన్ పేరును ఇకపై జగన్ మోడీ రెడ్డిగా మారిందనీ ఆయన చెప్పారు.
 
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశిలో పర్యటించిన లోకేశ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లు ఏపీకి కేంద్ర సర్కారు ద్రోహం చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి జగన్‌, పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు. 
 
కానీ, 68 యేళ్ల వయసులో మన కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న టీడీపీ అధినేత, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునిపై పొద్దస్తమానం విమర్శల వర్షం గుప్పిస్తున్నారనీ ఆరోపించారు. 
 
మోడీపై విమర్శలు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం పట్టుకుందని నారా లోకేశ్ విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి పేరు మారిందని, ఇప్పుడు ఆయన పేరు జగన్‌ మోదీ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 25కి 25 లోక్‌సభ సీట్లు సాధిస్తామని లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments