Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?

Updated: శనివారం, 2 మార్చి 2019 (13:21 IST)
2014 నుంచి విద్యానికేతన్‌ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరిగి అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని మోహన్‌బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటంలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు. 
 
విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంపై.. ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదని మోహన్ బాబు తెలిపారు. మూడు నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని మోహన్ బాబు చెప్పారు. కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదు. భిక్షం వేసినట్లు కొద్దిగా ఇస్తున్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి. అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. 
 
దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా అంటూ అడిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే.. ఆందోళన తప్పదని హెచ్చరించారు. తమ విద్యాసంస్థల్లో ర్యాంగింగ్ లేదని.. తాను రాజకీయం కోసం కాదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడుతున్నానని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. 

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments