సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (14:10 IST)

కోడిపిల్లకు ముద్దులు పెట్టిన కోతిపిల్ల-వీడియో వైరల్

సోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం అనేక వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. నేటి అధునాతన సమాజంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా విషయం పలువురి దృష్టికి చేరాలంటే నేషనల్ ఛానెళ్లు, పత్రికలాంటివి వినియోగించేవారు. అయితే ఇప్పడు సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎక్కడా ఏ చిన్న విషయం జరిగినా అందిరికీ తెలిసిపోతోంది. ఇపుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
 
ఏంటంటే.. ఓ అల్లరి కోతిపిల్ల.. ఓ క్యూట్ కోడిపిల్లను తనచేతిలోకి తీసుకుంది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుండి తప్పించుకోనేందకు ప్రయత్నిస్తుంటే.. కోతిపిల్ల మాత్రం ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంటోంది. అంతేకాదండోయ్.. ఆ కోడిపిల్లకు ముద్దులు కూడా పెడుతోంది. ఈ వీడియోను ఓ అటవీశాఖ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.