Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో దెయ్యం, సెలబ్రెటీ సింగర్‌గా మారిన రణు ఏం చేసిందో చూడండి

Written By ఐవీఆర్
Updated: మంగళవారం, 19 నవంబరు 2019 (18:00 IST)
మనం సమాజంలో చాలామందిని చూస్తుంటాం. రోడ్డుపైన అద్భుతమైన పెయింటును బొగ్గుతో వేస్తూ కనబడుతుంటారు కొందరు. మరికొందరు మురికివాడల్లో మైఖేల్ జాక్సన్ లెవల్లో డ్యాన్సులు వేసేవారు కొందరు కనబడుతుంటారు.

ఐతే అలా చూడటం వరకే కానీ వాళ్ల టాలెంటును బయటకు తెచ్చే ప్రయత్నం ఏకొద్దిమందో చేస్తుంటారు. అలా ముంబై రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ పొట్టబోసుకునే రణు మోండల్ అనే మహిళను ముంబై సినీ ఇండస్ట్రీలోని కొందరు ఆమెతో పాటలు పాడించడంతో పాటు ఆమె లుక్‌ను కూడా మార్చేశారు.
 
దీనితో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమెను పలువురు సెలబ్రిటీలు తమతమ షోలకు పిలుస్తూ ఇంటర్వ్యూలు గట్రా లాగించేస్తూ వున్నారు. ఇంకేం... ఆమె కాస్తా ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి.
 
ఈ నేపధ్యంలో ముంబై రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ పైనుంచి క్రేజీ సింగర్‌గా మారడంతో ఆమెతో ఇటీవల ఓ మహిళా అభిమాని సెల్ఫీ కావాలని అడిగారు. కానీ రణు ఆమెతో, ‘ఏయ్ నన్ను ముట్టుకోకు. నేను సెలబ్రిటీని’ అని అడటంతో అవాక్కయ్యారు. అంతేకాదు, ఇప్పుడు ఆమె వేసుకున్న మేకప్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆమె వేసుకున్న మేకప్ చూసి వామ్మో దెయ్యం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా... మనమే ఆమెను స్టార్ ను చేశాం. ఇప్పుడు మనల్నే వెక్కిరిస్తోంది అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ.
 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments