Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తుకు వెళ్లం... ఐదేళ్లూ అధికారంలో ఉంటాం : నారా లోకేశ్

తెలంగాణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికల

Written By pnr
Updated: గురువారం, 13 సెప్టెంబరు 2018 (15:39 IST)
తెలంగాణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు.
 
గురువారం లోకేశ్ విజయవాడలో ఐటి కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభను రద్దు చేసి ముందస్తు వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. 
 
ముందస్తుపై వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. ప్రస్తుతం ఎన్నికలపై ఆలోచన లేదని.. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు. తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్ల పాటు నడవకపోవడం దురదృష్టకరమని లోకేశ్‌ అన్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Varun Tej: అభిమానుల పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్న వరుణ్ తేజ్

Sharwa : భోగి కోసం భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా

Ajay Bhupathi: ఆర్‌ఎక్స్ 100 తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదనుకున్నా : అజయ్ భూపతి

చిన్నప్పుడు మా మావయ్య ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు: నటి శివాంగి

Vijay Deverakonda:.హాలీవుడ్ టెక్నీషియన్స్ స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments