శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (18:52 IST)

పవన్ గారితో ఖచ్చితంగా టచ్‌లోనే వుంటా... రేణూ దేశాయ్ స్పష్టీకరణ

రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమెకు నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో ట్రోలింగ్ తట్టుకోలేక దాన్ని క్లోజ్ చేసిన రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో మాత్రం అందుబాటులో వున్నారు. రెండో పెళ్లి చేసుకుంటున్న

రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమెకు నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో ట్రోలింగ్ తట్టుకోలేక దాన్ని క్లోజ్ చేసిన రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో మాత్రం అందుబాటులో వున్నారు. రెండో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఇక పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో వుండరా అని ఓ అభిమాని రేణుని ప్రశ్నించాడు. దీనికి రేణూ దేశాయ్ ఎంతమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చేసింది.
 
పవన్ కళ్యాణ్ గారు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి. వారి భవిష్యత్ కోసం నేను ఆయనతో తప్పకుండా టచ్‌లో వుండక తప్పదు. శెలవుల్లోనో, పండుగలు వచ్చినప్పుడో అకీరా, ఆద్యలిద్దరూ ఆయన వద్దకు వెళ్తారని వెల్లడించింది. మొత్తమ్మీద పెళ్లి చేసుకుంటున్నప్పటికీ పిల్లల కోసం ఇద్దరూ ఒకరికొకరు సంప్రదించుకుంటామని తేల్చి చెప్పేసింది రేణూ దేశాయ్. ఇక నెటిజన్లకు క్లారిటీ వచ్చేసినట్లే.