Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

హౌడీ మోడీతో భారత్ గౌరవం పెరిగింది : నరేంద్ర మోడీ

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (12:02 IST)
ప్రపంచ వేదికపై హౌడీ మోడీ అనే కార్యక్రమంతో భారత్ ప్రతిష్ట, గౌరవం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ఆయన.. శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. 
 
అపుడు వారిని ఉద్దేశించిన నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, '2014లోనూ అమెరికా వెళ్లాను. ఐరాస సమావేశాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు కూడా వెళ్లాను. ఈ ఐదేళ్లలో భారత్‌ పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో భారీ మార్పు చూశాను. భారత్‌ అంటే ఆసక్తి, గౌరవం మరింత పెరిగాయి' అని చెప్పుకొచ్చారు. 
 
హ్యూస్టన్‌లో అట్టహాసంగా జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, పలువురు డెమొక్రాట్, రిపబ్లికన్‌ పార్టీల నేతలు హాజరుకావడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంతో భారత్ సత్తా అంటే ఏంటో తెలియవచ్చిందన్నారు. 
 
ముఖ్యంగా ప్రవాస భారతీయుల ఉత్సాహం తననెంతో ఆకర్షించిందన్నారు. మూడేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా మోడీ గుర్తుచేశారు. 'మూడేళ్ల క్రితం నాటి ఈ రోజును మర్చిపోలేను. ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు' అని చెప్పారు. భారతీయులను గర్వపడేలా చేసిన భారతీయ సైనికుల సాహసానికి గుర్తుగా ఆ రోజు నిలిచిపోతుందని చెప్పారు.  

అన్నీ చూడండి

Nabha Natesh : ప్రిన్స్ ధ్రువ సర్జా జోడీగా లవ్ స్టోరీ కెమిస్ట్రీ తో నభా నటేష్

జిమ్ జిమ్ తార.. పాట తో పర్ణశాల మూవీ టీమ్ సోషల్ మీడియాను ఎట్రాక్ట్ చేసింది

haiku: ఉమెన్స్ కాలేజీలో అబ్బాయి చదవడమా? హైకూ లో చెప్పిందేమిటి?

Anupama Parameswaran: థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న క్రేజీ కల్యాణం మూవీ

Teja Sajja: ది ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్‌ రావడం ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

తర్వాతి కథనం
Show comments