Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్లుగా ఉన్నపుడే పెళ్లి చేసుకున్న ప్రణయ్ - అమృత

పరువు హత్యకు గురైన ప్రణయ్ చిన్న వయసులోనే తన ప్రియురాలు అమృతవర్షిణిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసు

Written By pnr
Updated: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (09:32 IST)
పరువు హత్యకు గురైన ప్రణయ్ చిన్న వయసులోనే తన ప్రియురాలు అమృతవర్షిణిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో దళిత వర్గానికి చెందిన ప్రణయ్ అనే యువకుడుని అమ్మాయి తండ్రి కిరాయి మనుషులతో హత్య చేయించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
 
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతలు హైస్కూల్‌లో కలసి ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఆపై కాలేజీ చదువుతున్న రోజుల్లో అతన్ని మరింతగా ఇష్టపడింది. ఆ సమయంలోనే రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరూ, తమ పెళ్లి బయటకు తెలిస్తే గొడవలు జరుగుతాయన్న భయంతో, దాన్ని దాచిపెట్టారని కేసు విచారణలో భాగంగా అమృతను ప్రశ్నించిన పోలీసు వర్గాలు వెల్లడించాయి.
 
ఆపై హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న రోజుల్లో వీరు నిత్యమూ కలిసేవారని, మైనారిటీ తీరిన నాలుగేళ్ల తర్వాత తమ రహస్య వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని భావించి, ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకున్నారని, ఆ తర్వాతే ఇద్దరి ఇళ్లలో పెళ్లి గురించి చెప్పారని అన్నారు. దీంతో అప్పటివరకూ కులాంతర వివాహం వద్దని హెచ్చరిస్తూ వచ్చిన అమృత తండ్రి, పెళ్లయిందని, గర్భం దాల్చిందని తెలుసుకున్న తర్వాత సైకోగా మారి హత్యకు ప్లాన్ చేశారు. 
 
ఇందుకోసం తనను గతంలో కిడ్నాప్ చేసిన ఐసిసి ఉగ్రవాదితో పాటు.. నయీం మనుషులను ఆశ్రయించాడు. వారికి భారీ మొత్తంలో అంటే రూ.కోటి వరకు సుపారీ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే ప్రణయ్‌ను కిరాయి హంతకులు హత్య చేసిపారిపోయారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

యశ్ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి - మల్లారెడ్డి వర్శిటీపై కేసు

దుష్ప్రచారం చేస్తే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా : గోవిందా హెచ్చరికలు

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

తర్వాతి కథనం
Show comments