శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (10:41 IST)

నువ్వు పెళ్లి చేసుకో.. మేం పెళ్లి ఊరేగింపుకు వస్తాం.. లాలూ ప్రసాద్ యాదవ్

lalu prasad yadav
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సెటైర్లు విసిరారు. "నువ్వు పెళ్లి చేసుకో.. మేం పెళ్లి ఊరేగింపుకు వస్తాం" అని రాహుల్‌కు లాలూ సలహా ఇచ్చారు. 
 
ఆ సలహా విన్నటువంటి రాహుల్ గాంధీతోపాటు అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అంతా సీరియస్‌ వాతావరణంలో లాలూ ప్రసాద్ యాదవ్ నవ్వించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో జోకులు పేలాయి. 
 
ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని అన్నారు. రాహుల్ తన మాట వినడం లేదని సోనియా గాంధీ చెబుతున్నారని లాలూ వెల్లడించారు. రాహుల్ గాంధీ గడ్డాన్ని చూపిస్తూ.. "నువ్వు తిరగడం మొదలుపెట్టి గడ్డం పెంచావు.. ఇక తీసేయి" అని అన్నారు.