గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

మా ఇద్దరిది గురుశిష్యుల బంధం - జేడీ చక్రవర్తి క్లారిటీ

vishnu priya
యాంకర్ విష్ణుప్రియతో ప్రేమ, పెళ్లి వార్తలపై సినీ నటుడు జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న బంధం కేవలం గురుశిష్యుల అనుబంధమేనని తెలిపారు. సోషల్ మీడియాలో తమ గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టంచేశారు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అది ప్రేమ మాత్రం కాదన్నారు. 
 
విష్ణుప్రియ - జేడీ చక్రవర్తిలు కలిసి ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. దాంతో వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో తాను జేడీ చక్రవర్తిని ఇష్టపడుతున్నానని, వాళ్ల అమ్మ అంగీకరిస్తే ఆయన్ని వివాహం చేసుకుంటాని ఇటీవల విష్ణుప్రియ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు. 
 
దీనిపై జేడీ చక్రవర్తి స్పందించారు. విష్ణుప్రియతో కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం దాదాపు 40 రోజుల పాటు పని చేశానని తెలిపారు. ఆ సమయంలో ప్రతి రోజు నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు ఆ దర్శకుడు చెప్పాడు. అలా నేను నటించిన చిత్రాలన్నీ చూసి ఆయా చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడిందని తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురు శిష్యుల అనుబంధమే కానీ, ప్రేమ బంధం లేదని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు.