జస్ట్ మ్యారీడ్... ఒకటైన సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్

శుక్రవారం, 14 డిశెంబరు 2018 (17:33 IST)
బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, కశ్యప్ ఈ రోజు... డిసెంబరు 14న పెళ్లి చేసుకున్నారు. జస్ట్ కొద్దిసేపటి క్రితమే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైనా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇకపోతే ఈనెల 16న గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఇన్విటేషన్ కార్డులను ప్రముఖులకు వెళ్లాయి. కాగా సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
 
2007లో ఓ టోర్నీలో కలిశామని.. ఆ ప్రయాణం మమ్మల్ని కలిపిందని.. టోర్నీలతో బిజీబిజీగా వున్నా.. అప్పుడప్పుడూ మాట్లాడేందుకు సన్నిహితంగా మెలిగే అవకాశం తమకు దక్కిందని ఆమె తెలిపింది. అయితే పెళ్లి ఆలోచన మాత్రం తమకు ఎప్పుడూ రాలేదని కూడా సైనా వివరించింది. 
 
ప్రస్తుతం టైమ్ దొరకడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని.. డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాను. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. ఆ రోజు మాత్రమే మాకు ఖాళీ దొరికింది. అందుకే ఆ తేదీనే ఫిక్స్ చేసుకున్నామని సైనా వివరించింది.
 
ఇన్నాళ్లూ టోర్నీలు గెలవడంపైనే దృష్టి పెట్టామని.. పెళ్లి తర్వాత తనపై బాధ్యత పెరుగుతుందని సైనా తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దనుకున్నాం. కానీ ఖాళీ దొరకడంతో  పెళ్లికి సిద్ధమయ్యామని చెప్పింది. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని సైనా పేర్కొంది.

అన్నీ చూడండి

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

తర్వాతి కథనం
Show comments