Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిపోతున్న అమెజాన్ అడవులు... చెన్నైకు పొంచివున్న ముప్పు

Updated: మంగళవారం, 27 ఆగస్టు 2019 (16:18 IST)
ప్రపంచానికి అవసరమైన అత్యధికమైన ప్రాణవాయువును అందిస్తున్న బ్రెజిల్‌లోని అమెజాన్ అడవులు కాలిబూడిదైపోతున్నాయి. ఈ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు మరింతగా పెరిగిపోతోంది. ఈ కార్చిచ్చుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ ఓ హెచ్చరిక చేశారు. బ్రెజిల్‌లో అమెజాన్ అడవులు కాలిపోతున్నాయన్నారు. కానీ, చెన్నై వంటి మహానగరానికి కూడా తీవ్రముప్పు పొంచివుందని సీమాన్ అభిప్రాయపడ్డారు. 
 
అమెజాన్‌ అడవుల్లో భయంకరమైన కార్చిచ్చు యావత్‌ ప్రపంచానికే ప్రమాదసంకటంగా మారే అవకాశం ఉందన్నారు. గతంలో ఏర్పడిన కార్చిచ్చు కంటే ఇది ఎన్నో రెట్లు పెద్దదని చెబుతున్న వార్తలు భయం కలిగిస్తున్నాయన్నారు. అమెజాన్‌ అడవుల్లో వేటకు నిషేధం విధిస్తే ఇటువంటి ప్రమాదాలను కొంత మేరకైనా అడ్డుకోవచ్చ న్నారు.
 
ఇది సాధారణమైన కార్చిచ్చు కాదని, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతిప్రళయంగా చూడాలని, ఇందుకు కారణాలు వాణిజ్య అంశాల కోసం ప్రకృతిని నాశనం చేసే మానవ తప్పిదాలేనని అన్నారు. అదేవిధంగా లండన్‌, న్యూయార్క్‌, షాంఘై, తమిళనాడు రాజధాని చెన్నై వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో భూమి అవసరాల నిమిత్తం ప్రకృతిని నాశనం చేస్తున్నారని, ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రకృతిని సంరక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని సీమాన్‌ సూచించారు.

అన్నీ చూడండి

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

Raj Tarun: టార్టాయిస్ యూనిక్ థ్రిల్లర్ మూవీ : రాజ్ తరుణ్

Naga Chaitanya :నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

తర్వాతి కథనం
Show comments