సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (20:11 IST)

కొటక్ మహేంద్రా యాడ్.. డ్రైవర్ స్పృహ కోల్పోతే.. యోగిత అలా డ్రైవ్ చేసింది..

Kotak Ad
కొటక్ మహేంద్రా రూపొందించిన యాడ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే..? గత జనవరి 7న మినీ బస్సును నడిపిన యోగిత అనే మహిళను స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. 
 
గత జనవరి 7న మినీ బస్సులో యోగితతో పాటు మరో 20 మంది మహిళలు బస్సులో పిక్‌నిక్ వెళ్లారు. ఈ క్రమంలో బస్సు డ్రైవ్ చేస్తూ.. డ్రైవర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే ప్రమాదం గమనించిన యోగిత.. బస్సు స్టీరింగ్ పట్టుకొని బస్సును డ్రైవ్ చేసి.. సకాలంలో బస్సును ఆసుపత్రి దగ్గరికి వెళ్లేలా చేసారు. ఆమె సాహసంతో బస్సు డ్రైవర్ ప్రాణాలతో పాటు తోటి మహిళల ప్రాణాలు కూడా కాపాడారు.
 
అప్పటి వరకు యోగితా బస్సు నడపనే లేదు. కానీ ఆ సమయంలో ఆమెకు ఆ విషయమే గుర్తురాలేదు. ఎలాగోలా డ్రైవర్ ప్రాణాలతో పాటు తోటి మహిళల ప్రాణాలు కాపాడాలనే తపనతో సాహసం చేసి అందరి ప్రాణాలు కాపాడారు. అలా 35 కిలోమీటర్లు బస్సు నడిపారు యోగితా. 
 
ఆ సాహసంతో యోగితా ఏకంగా బ్రాండెడ్ కంపెనీ కొటక్ మహేంద్రాకు స్ఫూర్తి అయ్యారు.  #DriveLikeALady పేరుతో కొటక్ మహేంద్రా రూపొందించిన యాడ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.