ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 డిశెంబరు 2019 (17:07 IST)

జనసేనానితో రాపాకకి గ్యాప్ వుందట, గెంతుతారా?

పిలిచినా, పిలవకపోయినా ఇపుడు వైసీపిలోకి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వెళ్లిపోయేందుకు విపరీతంగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చుని, అధికార పార్టీతో పోరాడే ఓపిక చాలామందికి వుండటంలేదు. పైగా ఐదేళ్లపాటు నిరీక్షించినా అధికారం దక్కుతుందో లేదో తెలియదాయె. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు ఎంతమాత్రం సందేహించడంలేదు. ఈ ఫార్ములాకి ఏ పార్టీ మినహాయింపు కాదని గతంలో ఎన్నో ఉదంతాలు చెప్పాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... జనసేన పార్టీ నుంచి గెలిచింది ఒకే ఎక ఎమ్మెల్యే. ఆయనే రాపాక వరప్రసాద్. ఇప్పుడాయన తనకూ పవన్ కల్యాణ్ కి మధ్య గ్యాప్ వుందని బహిరంగంగానే చెపుతున్నారు. ఐతే ఈ గ్యాప్ త్వరలోనే తొలగిపోతుందని తను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విషయంలోనే ఆ గ్యాప్ అనేది ఆయన మాటల్లోనే తెలుస్తుంది. 
 
వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన వుండటంలేదు కాబట్టి వారి వెనుకబడే వుంటున్నారనీ, జగన్ ప్రభుత్వం తీసుకున్న ఆంగ్లమాధ్యమం ఈ సమస్యను పరిష్కరిస్తుందనీ, ఇది ఎంతో చక్కని నిర్ణయం అంటూ చెప్పేశారు. కాగా ఆంగ్ల మీడియం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మ భాష గొంతు నొక్కవద్దని అంటున్నారు. మరి... ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ ఎలా భర్తీ అవుతుందో చూడాలి.