సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (15:48 IST)

నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకు?

Sudha murthy
Sudha murthy
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ప్రస్తుతం నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమె చేసిన పనికి సుధామూర్తిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మైసూరు రాజ మహిళ పాదాలకు సుధామూర్తి నమస్కరించడంతో వివాదం చెలరేగింది. 
 
రాజ్యాలు, రాజుల కాలం ఎప్పుడో ముగిసినప్పటికీ ఇంకా రాజవంశానికి చెందిన వారికి ఇలా నమస్కరించడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సుధామూర్తి లాంటి ఉన్నతస్థాయి వ్యక్తులు రాజ వంశీకుల్ని అంతలా గౌరవించాలా.. అంటూ అడుగుతున్నారు. 
 
సుధామూర్తి చేసిన పని బానిసత్వానికి ప్రతీక అని ఒకరంటే, ఇప్పటికీ అంత గౌరవం పొందే అర్హత వారికుందా అంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు. అయితే, కొందరు సుధామూర్తి చేసిన పనిని సమర్ధిస్తున్నారు.