సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 11 జనవరి 2019 (22:21 IST)

ద్యావుడా.. జగన్‌కు ముద్దుపెట్టిన పీఠాధిపతి.. ఎవరు?

సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయిన సంధర్భంగా తిరుమల శ్రీవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు ఎపి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. జగన్ పర్యటన రోజే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి కూడా తిరుమలకు వచ్చారు. స్వరూపానందస్వామిని స్వయంగా జగన్ కలిశారు. 
 
అయితే వీరిద్దరు కలిసిన సమయంలో ఆసక్తికర చర్చలు జరిగాయి. ఒక పీఠాధిపతి రాజకీయ నాయకుడి చెవిలో వ్యాఖ్యలు చేయడం.. ఆయనకు ముద్దు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో నువ్వే కాబోయే సిఎం అంటూ విశాఖ శారదా పీఠాధిపతి జగన్ చెవిలో చెప్పి ముద్దు పెట్టినట్లు వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. 
 
ఇప్పటికే కెసిఆర్ విశాఖకు వెళ్ళి స్వరూపానందను కలవడం.. ఆ తరువాత జగన్ వెళ్ళి తిరుమలలో శారదా పీఠాధిపతిని కలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. పీఠాధిపతిగా ఉన్న స్వరూపానంద స్వామి రాజకీయ నేతలతో సన్నిహితంగా ఉండడంతో హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.