Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ (బి.1.1.529) వేరియంట్ లక్షణాలేంటి?

Written By ఠాగూర్
Updated: సోమవారం, 29 నవంబరు 2021 (16:14 IST)
ఇపుడు ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. ఈ వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా. ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణికులపై వివిధ రకాలైన ఆంక్షలు విధిస్తున్నారు. 
 
ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలుత సౌతాఫ్రికాలో గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఇజ్రాయిల్, బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్ వంటి దేశాల్లో కూడా ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీంతో ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై పలు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. ఇలా ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏంటిఅనే విషయాన్ని తెలుసుకుందాం. 
 
* ఈ వైరస్ సోకిన వారిలో తొలుత అలసటగా ఉంటుంది. ఒంటి నొప్పుల, గొంతులో కొద్దిగా గరగరగా ఉంటుంది. 
* పొడిదగ్గుతో పాటు.. కొద్దిపాటి జ్వరం కూడా వస్తుంది. 
* ఈ వైరస్ లక్షణాలు కూడా చాలా మేరకు చికెన్ గున్యా జ్వర లక్షణాలో ఉంటాయి. 
 
* ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. శారీరక వ్యాయామం, డి విటమిన్ కోసం ఎండలో వాకింగ్ చేయడం వంటి పనులు చేయాలి. 
* ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. శాఖాహారులు అయితే విటమిన్ బి12ను తీసుకోవాలి. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments