ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (16:40 IST)

Whale Vomit: కోటీశ్వరురాలైన థాయ్ మహిళ.. అసలేం జరిగింది..?

whale
తిమింగలం చేసిన వాంతులతో ఓ మహిళ కోటీశ్వరురాలైంది. సాధారణంగా సముద్ర తీరంలో నడిచి వెళ్తూ వుంటే.. గవ్వలు కనిపిస్తుంటాయి. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళను అదే సముద్ర తీరం కోటీశ్వరురాలుగా మార్చింది.
 
వివరాల్లోకి వెళితే.. సైరిపోర్న్ (49) అనే మహిళ బీచ్‌లో నడిచి వెళ్తుండగా.. ఆమె కంటికి వ్యత్యాసమైన వస్తువు కంటికి కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే షాక్. అది బంగారమో, వెండో కాదు.. అంతకంటే విలువైన తిమింగలపు వాంతులు. 
 
అవును తిమింగలం వాంతులు చేయడాన్ని అరుదుగా భావిస్తారు. దీనిని సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. తిమింగలం వాంతులతో తయారు చేయబడిన సుగంధ ద్రవ్యాలు విలువైనవి.
 
అలాంటి అరుదైన వస్తువు సైరిపోర్న్‌కు లభించింది. దీని విలువ ప్రస్తుతం రూ.1.3 కోట్లు. ప్రస్తుతం దీనిని విక్రయించేందుకు సైరిపోర్న్ సిద్ధంగా వుంది. దీనిని అమ్ముకుంటే తమ జీవన శైలి పూర్తిగా మారిపోతుందని చెప్తోంది.