Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతకు ముచ్చటగా మూడో పెళ్లి.. రెండో భార్యే సంతకం చేసి..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 28 నవంబరు 2023 (22:59 IST)
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. 
 
సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అటవీశాఖ ఏలూరు పరిధిలోని సెక్షన్‌ అధికారిణి సుజాతతో వెంకట రమణ వివాహం జరిగింది. ఆయన రెండో భార్య సునీత సాక్షి సంతకం చేశారు. వెంకట రమణకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. 
 
మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా..ఆమెకు కూతురు ఉంది. అనంతరం కైకలూరు ప్రాంతానికి చెందిన సునీతను రెండో వివాహం చేసుకోగా ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సునీత విజయవాడలో ఉంటున్నా తన పిల్లలతో కలిసి జయమంగళ ఇంటికి వచ్చి వెళ్తోంది. రెండో భార్య, పిల్లల అంగీకారంతోనే జయమంగళ మూడో పెళ్లి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పెళ్లయిన సుజాతకు ఇది రెండో పెళ్లి. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.

అన్నీ చూడండి

Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు

Sudheer : మదర్ సెంటిమెంట్ తో సుధీర్స్ జోకర్, తల్లిగా అభిరామి

క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రంగులు మార్చే మనిషి కకథగా నిరమ్ ట్రైలర్

Kiara Advani : ఎరుపు రంగు దుస్తుల్లో కవ్వించే లుక్ తో కియారా అద్వానీ

తర్వాతి కథనం
Show comments