గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (21:09 IST)

పురుషులకు 30- మహిళలకు 26.. పెళ్లి చేసేయండి..

marriage
30వ ఏట పెళ్లి చేసుకోవడమే మంచిదా అంటే అవునని అంటున్నారు సైకాలజిస్టులు. 25 కంటే 30 ఏళ్లలో పెళ్లి చేసుకునేవారు కొన్ని విషయాల్లో సరిగ్గా ఆలోచిస్తారని తేలింది. 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకునే వారిలో ఇతరులను అర్థం చేసుకునే సత్తా పెరుగుతుంది. 
 
సహజంగా మరింత అవగాహన ఉంటుంది. భాగస్వామిని సులభంగా అర్థం చేసుకుంటారు. జీవితాన్ని బాగా అర్థం చేసుకునే పరిపక్వత వుంటుంది. 25పై బడిన వారికంటే 30 ఏళ్ల వయస్సులో పెళ్లి భాగస్వాములు సులభంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. 30 ఏళ్ళ తర్వాత ఫ్యామిలీని మెంటెయిన్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 
 
30 ఏళ్ళలో మెచ్యూరిటీ వస్తుంది. అయితే 30 దాటక గర్భధారణ మహిళల్లో కాస్త ఇబ్బందులను తెస్తాయి. కాబట్టి పురుషులకు 30 పెళ్లికి వయస్సుగా నిర్ణయించుకోవచ్చు. మహిళలకు మాత్రం 26 నుంచి 28 లోపు వివాహం చేసేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.