బాలికపై అత్యాచారం : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరెస్టు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో 16 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం ఉదయం ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో ఆ

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (11:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో 16 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం ఉదయం ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
 
ప్రస్తుతం లక్నో సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆయనపై ఇప్పటివరకు మొత్తం 3 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఐపీసీ 363 (కిడ్నాప్), 366 (మహిళల అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరత బెదిరింపులు) సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
 
గత గతయేడాది జూన్‌లో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారనీ… సంవత్సరం నుంచి పోరాడుతున్నా అధికారులు తనకు న్యాయం చేయలేదని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారంపై కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఈ నెల 3న ఎమ్మెల్యే సోదరుడు, అతడి అనుచరులు బాధితురాలి తండ్రిని చెట్టుకు కట్టేసి దారుణంగా చావబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించగా, పోలీసు కస్టడీలోనే బాధితురాలి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన మొత్తం ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటుపడింది. మరోవైపు, ఇదే కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సోదరుడు, అతని అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెను చర్చనీయాంశమైంది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టి, ఎమ్మెల్యేను అరెస్టు చేసింది. 

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments