Daily Horoscope
✕

కాంగ్రెస్‌కు టాటా చెప్పిన నటి ఊర్మిళా మదోండ్కర్

Updated: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (16:25 IST)
బాలీవుడ్ సినీ నటి ఊర్మిళా మదోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో జరుగుతున్న చిల్లర రాజకీయాలతో విసిగిపోయానని, అందుకే పార్టీ తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెపై బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి విజయం సాధించారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సైతం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అయన మార్గంలోనే పలువురు నేతలు తమతమ పదవులకు రాజీనామా చేశారు. 
 
ఈ క్రమంలో ఊర్మిళ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, రంగీలా, జుదాయి, మస్త్ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో ఊర్మిళ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రంగీలా చిత్రం ఆమె ఇమేజ్‌ను ఒక్కసారిగా పెంచిన విషయం తెల్సిందే. 

అన్నీ చూడండి

Keerthy Suresh: సత్యవాన్ సావిత్రి కీర్తి సురేష్‌కు కలిసొస్తుందా?

పాత్ర కోసం జుట్టు పొట్టిగా కత్తిరించుకున్న సాయిపల్లవి

Satvika Veeravalli: సిలికాన్ వ్యాలీ నుంచి సిల్వర్ స్క్రీన్‍కు... ఆకాశంలో ఒక తారగా సత్విక వీరవల్లి

హనుమాన్ హీరో తేజ సజ్జకు ఎంగేజ్‌మెంట్..

Aadi Sai kumar: ఆది సాయికుమార్ నటిస్తున్న అరుంధతి నక్షత్రం ఘనంగా ప్రారంభం

తర్వాతి కథనం
Show comments