బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (15:48 IST)

నిశ్చితార్థానికి లారీ నడుపుతూ వచ్చిన వధువు..

Kerala
Kerala
కేరళలోని త్రిసూర్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి, యువకుడికి నిశ్చితార్థం జరుగుతోంది. కొత్త వధువు ట్రక్కును నడుపుతూ వరుడిని చర్చికి తీసుకువచ్చింది. నిశ్చితార్థ వేడుకకు హాజరైన వారంతా దీన్ని చూసి షాకైయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. మనలూరు జిల్లాకు చెందిన దలీషా అనే యువతి లారీలు నడపడంలో ఎప్పటి నుంచో ఇష్టపడేది. ట్రక్ డ్రైవర్ కూడా. దలీషా తన తండ్రి లేకుండా అప్పుడప్పుడు ట్రక్కు నడుపుతూ ఉండేది. ఆమె కొచ్చి నుంచి మలప్పురం బంకుకు పెట్రోలు రవాణా చేసేది. 
 
ఈ విధంగా ఆమె ట్యాంకర్ లారీ నడుపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. గల్ఫ్ కార్పొరేషన్ ఆమెకు జాబ్ ఆఫర్ పంపింది. గల్ఫ్‌లో ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించిన ఆమెకు ఆ ప్రాంతంలోని కంజిరాపల్లికి చెందిన డ్రైవర్‌ హాన్సన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీరి వివాహానికి ఇరువురి కుటుంబాలు ఆమోదం తెలిపాయి.