Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి బాంబు పేలుళ్ళ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 7 జూన్ 2022 (08:47 IST)
గత 2006లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన వలీ ఉల్లా ఖాన్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో వలీ ప్రధాన సూత్రధారి కావడంతో ఆయనకు ఘజియాబాద్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. 
 
2006లో జరిగిన ఈ పేలుళ్లలో 20 మందికిపై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా వంద మందికిపై గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, కేసు విచారణ ఘజియాబాద్ కోర్టులో సాగింది. ఈ మూడు కేసుల్లో ఏ1గా వలీ ఉన్నారు. ఇందులో తొలి కేసులో ఉరిశిక్ష విధించగా, రెండో కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించింది. 
 
మూడో కేసులో సరైన సక్ష్యాధారాలు లేకపోవడంతో వలీని నిర్దోషిగా విడుదల చేసింది. వారణాసి పేలుళ్ల తర్వాత ఈ కేసులో వలీ తరపున విచారించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకురాలేదు. దీంతో ఈ కేసు విచారణను ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ కోర్టు బదిలీ చేసింది. ఇపుడు ఈ కేసు కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

అన్నీ చూడండి

ఐశ్వర్య రాజేష్, సుమంత్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ తో మహేంద్రగిరి వారాహి టీజర్

Kiccha Sudeep : బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్ లో కిచ్చా సుదీప్ లుక్

Nagarjuna: కింగ్ 100 టీజర్ ను కిక్ ఆఫ్ అని అభివర్ణించిన చైతన్య, మహేష్ బాబు, రామ్ చరణ్

పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు : సమంతకు ఆన్సర్ ఏంటి?

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments