Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

డ్రాగన్ ఫ్రూట్ పేరు కమలంగా మారింది.. ఎందుకిలా..?

Written By సెల్వి
Updated: బుధవారం, 20 జనవరి 2021 (14:17 IST)
మన దేశానికి పొరుగునున్న చైనా అంటేనే మోడీ సర్కార్‌ భగ్గుమంటోంది. దేశ సరిహద్దుల వద్ద సంఘర్షణ గానీ, యాప్‌ల నిషేధం... వస్తువుల దిగుమతులు కానీ.. ఇలా ఒకటేమిటి దాదాపు అన్నింటిలోనూ బిజెపి ప్రభుత్వం చైనాపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఫ్రూట్‌గా పేరొందిన డ్రాగన్‌ ఫ్రూట్‌ పేరును తనకు అనుకూలంగా మార్చేసుకుంది గుజరాత్‌ ప్రభుత్వం. ఆ ఫ్రూట్‌కు కమలంగా నామకరణం చేసింది. 
 
కమలం ఆకారంలో ఉండడంతో.. ఈ పేరుని ఖరారు చేసినట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజరు రూపానీ తెలిపారు. ఇప్పటికే కమలం పేరుతో గుజరాత్‌లో బిజెపి పార్టీ కార్యాలయం కూడా ఉంది. అందులోనూ ప్రధాని మోడీ సైతం... విదేశీ పంటైనప్పటికీ...ఇక్కడి రైతులు పండిస్తున్నారంటూ మన్‌కీబాత్‌లో ఈ పండును గురించి ప్రస్తావించడంతో ...ఈ పేరు మార్పు జరిగినట్లు తెలుస్తోంది.
 
పాలక బీజేపీకి పార్టీ చిహ్నంగా ఉన్న లోటస్‌కు "కమలం" అనే పదం సంస్కృతం. ఇది గుజరాత్‌లోని బిజెపి కార్యాలయం పేరు కూడా. అన్యదేశ పండ్ల పేరు మార్చడానికి గుజరాత్ ప్రభుత్వం పేటెంట్ కోసం దరఖాస్తు చేసిందని, ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా నుండి దిగుమతి చేయబడిందని, కానీ ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో పండిస్తున్నారు. అందుకే పేరు కమలంగా మారిపోయింది. 
 
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇకపోతే ఈ వార్తపై సోషల్ మీడియాలో విభిన్న రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా "డ్రాగన్ హత్య చేయబడింది" అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చమత్కరించారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments