బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (21:52 IST)

18 ఏళ్ల యువతిపై అత్యాచారం.. భవనంపై పైనుంచి తోసేశాడు..

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో దారుణం జరిగింది. నగరంలో పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం భవనంపై నుంచి కిందకు తోసేశారు. 
 
దాంతో బహుళ అంతస్తుల భవనాల మధ్యగా ఉన్న రోడ్డుపై ఆ యువతి పడిపోయింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆస్పత్రి చేర్చామని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహలోకి వచ్చిందని పోలీసులు చెప్పారు. అయితే నిందితుడు ఎవరనే విషయాన్ని బాధితురాలి చెప్పలేకపోతున్నదని, తాము ప్రస్తుతం నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.