Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ గవర్నర్‌కు ఘోర అవమానం ..

Written By ఠాగూర్
Updated: గురువారం, 5 డిశెంబరు 2019 (17:44 IST)
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో గురువారం అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ ధన్‌కర్‌కు ప్రొటోకాల్ మర్యాదలు లభించలేదు. గవర్నర్‌కు మాత్రమే ప్రవేశం ఉన్న గేట్ నంబర్ 3కి తాళాలు పెట్టడంతో దన్‌కర్ మీడియా, అధికారులు ప్రవేశించడానికి ఉద్దేశించిన గేట్ నంబర్ 4 నుంచి అసెంబ్లీలోకి ప్రవేశించవలసి వచ్చింది. ఈ సంఘటన దేశ ప్రజాస్వామిక చరిత్రకు మాయని మచ్చని, ఇది సిగ్గుచేటని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తాను అసెంబ్లీలో సౌకర్యాలను పరిశీలిస్తానని, లైబ్రరీని సందర్శిస్తానని ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ గేట్ నంబర్ 3కి తాళాలు ఎందుకు వేయవలసి వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, గవర్నర్ ఆమోదం పొంది రావలసిన బిల్లులు రాకపోవడంతో అసెంబ్లీ స్పీకర్ మంగళవారం సభను అర్థంతరంగా గురువారం వరకు రెండు రోజులు వాయిదా వేశారు. ఈ పరిస్థితులలో గవర్నర్ గురువారం అసెంబ్లీ సందర్శనకు వచ్చారు. బుధవారం కూడా కోల్‌కతా యూనివర్సిటీని సందర్శించిన గవర్నర్ ధన్‌కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. 
 
వైస్ ఛాన్సలర్ కార్యాలయ గదికి తాళం వేసి ఉండడంతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ పక్క గదిలో కొద్ది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. విసి సోనాలి చక్రవర్తి బంధోపాధ్యాయ ఎంతకీ రాకపోవడం, ఆమె ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉండడంతో ఆయనకు దిక్కుతోచలేదు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ అధికారులు సైతం అక్కడ లేకపోవడంతో కొద్ది సేపటి తర్వాత గవర్నర్ వెనుకకు తిరగాల్సి వచ్చింది. 

అన్నీ చూడండి

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

కుక్కకాటు నుంచి తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ నటి రవీనా టాండన్‌? (video)

Varanasi Story Updage: అంటార్కిటికాలో గడ్డకట్టిన మంచులో వారణాసి నుంచి మహేష్ బాబు

తర్వాతి కథనం
Show comments