సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (22:28 IST)

ఔషధాల గని వేప చెట్టు... వాస్తు ప్రకారం చూసినా.. (Video)

వేప చెట్టు ఔషధాల గనిగా మన పెద్దలు పేర్కొన్నారు. పైగా, వాస్తు ప్రకారం చూసుకున్నప్పటికీ ఇది ఎంతో శుభప్రదమైనది. అందుకే వేప చెట్టుని ఇంటి వాయువ్య మూలన పెంచుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ఆ చెట్టు నుంచి వచ్చే గాలి ప్రధాన బెడ్‌రూమ్ కిటికీల నుండి లోనికి వచ్చేలా చూసుకోవాలి. ఈ గాలిని పీల్చడం ఆరోగ్యానికి ఎంతో శుభప్రదం. 
 
అలాగే, గులాబీ మొక్కల విషయానికి వస్తే అవి ఇంట్లో సానుకూల శక్తి ప్రసరించేలా చేస్తాయి. గులాబీ మొక్కలను నైరుతి దిశలో పెంచుకోవడం మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా, ఇంట్లో మందార మొక్కలను పెంచుకోవాలి అనుకున్నప్పుడు తూర్పు, ఉత్తర దిశలో నాటుకోవడం మంచిదని, దీనివల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.