Daily Horoscope
✕

వాస్తు ప్రకారం ఇంటి స్థలాలు కొనడం ఎలా..?

Updated: గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:28 IST)
ఇంటి నిర్మాణంలో స్థలాలు ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంటి స్థలాన్ని వాస్తురీత్యా ఎంపిక చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు దరిచేరుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. స్థల ఎంపికలో ఏదేని లోపమున్నట్లైతే అశుభ ఫలితాలు, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యజమానులకు అశాంతి కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు. ఇకపోతే వాస్తు ప్రకారం ఎటువంటి స్థలాన్ని కొనకూడదని పరిశీలిస్తే... 
 
ఈశాన్యము తగ్గిన స్థలాలను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశావృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంది. స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే వారి స్థలాల నుండి మన స్థలంలోకి పారకుండా విధంగా చూసుకోవాలి. ఇలా ఇతరుల స్థలం మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి స్థలం నివసించటానికి మంచిది కాదు. రెండు విశాలమైన స్థలాల మధ్యనున్న ఇరుకైన స్థలాన్ని కొనకూడదు. దీనివలన మనశ్శాంతి ఉండదు. ఎన్నో ఒత్తిడిలకు లోనవుతారు. 
 
ఇలాంటి స్థలాల్నికొనాలి:
ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ స్థలాన్ని కొనడం శుభఫలాన్నిస్తుంది. యజమానికి పేరు ప్రతిష్టలు, సంతానం, మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఉత్తర - ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలుగజేస్తుంది. ఆ ఇంట స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు. తూర్పు- ఈశాన్యం, ఉత్తరం - ఈశాన్యం పెరిగిన స్థలాలను కొనడం ద్వారా మంచి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబం సుఖ సంతోషాలతో సాగుతుందని వాస్తు చెబుతోంది.

అన్నీ చూడండి

వేగా జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో 'రాగ దాండియా ఉత్సవ్' : ఎండీ నవీన్ వనమా

వివాహేతర సంబంధం... భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళలదే కీలకపాత్ర.. రాష్ట్రపతి

సముద్రంలో తేలుతూ కొట్టుకు వస్తున్న ఐఫోన్లు... వీడియో

పాకిస్థాన్ పైలెట్లపై నిషేధం - ఎయిర్ ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవ.. టూవీలర్స్‌పై నిషేధం

నవరాత్రులు 2026: నవరాత్రుల్లో శ్రీ దుర్గా మంత్రాన్ని ఏ వేళలో పఠించాలంటే?

15-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...

14-10-2026.. బుధవారం మీ రాశి ఫలాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త..

తర్వాతి కథనం
Show comments