సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:06 IST)

గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల ఉప్పు కలిపి...?

బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగకుండా, ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అవేంటంటే.. చూద్దాం.. కొబ్బరి నూనెలో పసుపు పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. ఆరెంజ్ ఫ్రూట్‌ను రెండుగా కట్ చేసి ముఖానిక మర్దన చేసి పది నిమిషాల పాటు సబ్బుతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ముఖసౌందర్యం పెంపొందుతుంది. 
 
ముఖంపై గల అవాంఛిత రోమాలను తొలగించాలంటే అప్పుడప్పుడు నిమ్మరసాన్ని అప్లై చేయాలి. రోజూ ఇలా చేయడం ద్వారా అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే.. రోజూ హాట్ వాటర్‌లో 2 స్పూన్ల నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది. గోళ్లను కత్తిరించేందుకు నూనె రాసుకుని కాసేపయ్యాక కట్ చేస్తే గోళ్ల షేప్ బాగుంటాయి. 
 
జుట్టు ఆయిలీగా వుంటే కోడిగుడ్డిలోని తెల్లసొన, పంచదారను ప్యాక్‌లా వేసుకుని మాడుకు పట్టించి తలస్నానం చేయాలి. టీ వడగట్టిన తర్వాత మిగిలిన తేయాకులో నిమ్మరసం చేర్చి తలకు పట్టిస్తే జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా తయారవుతాయి. వేపాకు, పుదీనా, మెహందీని ఎండబెట్టి పౌడర్‌లా చేసుకోవాలి. అప్పడప్పుడు ఈ మిశ్రమాన్ని పాలతో పేస్ట్‌లా కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖ సౌందర్యం పెంపొందుతుంది. 
 
గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల ఉప్పు కలిపి కంటిని శుభ్రం చేస్తే కంటికి ప్రత్యేక ఆకర్షణ లభిస్తుంది. మోకాళ్లపై గల నల్లటి వలయాలు పోవాలంటే ఆ ప్రాంతాల్లో నిమ్మరసాన్ని అప్లై చేసి, సబ్బుతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. అలాగే ముడతలు తొలగిపోవాలంటే.. ఆలివ్ ఆయిల్‌ను రాసుకుని 10 నిమిషాల తర్వాత స్నానం చేయాలి.