శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (12:34 IST)

నిమ్మచెక్కలతో అలా చేస్తే..?

పాదాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వలనే కాళ్లు పగులుతాయి. కొంతమందికైతే కాళ్లు పగుళ్ళ నుండి రక్తం కూడా కారుతుంటుంది. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా రాతి ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి. ఆ నీటిలో 10 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. ఇలా రోజూ చేయడం వలన పాదాలు పగుళ్లు పోయి మృదువుగా తయారవుతాయి.
 
2. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందుగా పాదాలను శుభ్రంగా కడుక్కుని, తడిలేకుండా తుడుచుకోవాలి. ఆ తరువాత వాజిలీన్, పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరినూనె రాసుకుని కాటన్ సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమంగా చేస్తుంటే పాదాలా చాలా తక్కువ రోజుల్లోనే సున్నితంగా తయారవుతాయి.
 
3. నిమ్మచెక్కలను పగుళ్లకు రుద్దుకోవడం ద్వారా కూడా కొన్నిరోజులకు కాళ్లు మృదువుగా తయారవుతాయి. కనుక సమయం దొరికినప్పుడల్లా ఇలా చేయండి ఫలితం ఉంటుంది.
 
4. వేప నూనెలో పసుపు వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దాన్ని కాళ్ల పగుళ్ళున్న చోట రాసుకోవాలి. ఇలా చేస్తుంటే.. పాదాల పగుళ్లు పోతాయి. అలానే పసుపు పేస్ట్‌ను కూడా పాదాలకు రాసుకుంటే సరిపోతుంది.