గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 31 మార్చి 2019 (11:46 IST)

రక్తపోటుతో బాధపడేవారు ఆవకాయ పచ్చళ్లు తినొచ్చా?

ఇటీవలి కాలంలో అనేక మంది బీపీ (రక్తపోటు), మధుమేహం (చక్కెర వ్యాధి) వంటి వ్యాధుల బారినపడుతున్నారు. బీపీ, డయాబెటీస్‌లతో బాధపడేవారు ఉప్పుకారం, చక్కెరలకు దూరంగా ఉంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఊరగాయ, ఆవకాయ పచ్చళ్లు అంటే అమితమైన ఇష్టం. వీటిని లొట్టలేసుకున ఆరగిస్తుంటారు. 
 
సీజన్లలో దొరికే కాయలు నిలువ చేసుకొని అన్‌సీజన్‌లో వాటి రుచిని ఎంజాయ్‌ చేస్తుంటారు. భోజనంలో ఒక ముక్క ఊరగాయ ఉంటే చాలు, మొత్తం భోజనం లాగించేస్తారు. మరి ఇంత రుచిని ఇచ్చే ఊరగగాయ ఎంత తీసుకోవచ్చు? ఎవరైనా సరే పచ్చళ్లు మితంగానే తీసుకోవాలి. పచ్చళ్లలో ఉప్పు శాతం అధికం కాబట్టి బీపీ ఉన్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. బీపీ ఉన్నవారు రోటీ పచ్చళ్లు తీసుకోవచ్చు. అయితే వీటిలో కూడా ఉప్పు తగ్గించి తీసుకోవాలి.
 
ఇక ఊరగాయల పోషక విలువల సంగతికి వస్తే, నిల్వ పదార్థం కాబట్టి వీటిలో గుడ్‌ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. మామిడికాయల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్‌ సి కూడా. ఆవకాయలో ఉండే నువ్వుల నూనె, ఆవాలు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలు కూడా వీటి నుంచి లభిస్తాయి.