మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (16:26 IST)

ఓ పాత్రలో ఉప్పు తీసుకుని ఈశాన్య మూలన ఉంచుకుంటే..?

వాస్తు అనేది ప్రాచీన కాలం నుండి ఉంది. ఈ వాస్తు, ఇంటిని అందంగా నిర్మించడానికే కాకుండా సానుకూల శక్తిని కూడా కలుగజేస్తుంది. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం మూలంగా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు. మీ ఇంటి ముఖద్వారాన్ని అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా సానుకూల శక్తి మీ ఇంటివైపుకి పయనిస్తుంది.
 
గృహం నిర్మించడంలో సూర్యకాంతి ఇంట్లో నలువైపులా విస్తరించునట్లు జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మీ ఇల్లు నూతన శక్తిని సంతరించుకుంటుంది. ఇలా రోజూ సూర్యకాంతి ఇంట్లో ప్రవేశించడం వలన శారీరక మానసిక సమస్యలు తొలగడమే కాకుండా, ఆరోగ్యకరమైన వాతావారణాన్ని ఏర్పరచడంలో సహాయం చేస్తుంది.
 
ఇంట్లో ఏ ప్రదేశాన్నైనా శుభ్రంగా ఉంచుకోవడం, వస్తువులను అందంగా సర్దుకోవడం అనేవి వాస్తుశాస్త్రం మొదటి సూత్రం. ఇలా ఉండని పక్షంలో సానుకూల శక్తికి అవరోధాలు ఏర్పడి, అయోమయ వాతారణం ఏర్పడుతుంది. దాంతో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా ముఖ్యం.
 
ఓ చిన్న పాత్రలో ఉప్పు ప్రతికూల ప్రభావాలని అడ్డుకోగలదని అందరికీ తెలిసిందే. మీ గృహంలో ప్రతికూల ప్రభావం ఉందని మీరు భావిస్తున్నట్టయితే ఓ పాత్రలో ఉప్పును తీసుకుని ఈశాన్య మూలన ఉంచుకోవాలి. తద్వారా ప్రతికూల ప్రభావాల నుండి మీ ఇల్లు శుద్దిగావింపబడుతుంది.