గోబీ పువ్వుతో పులావ్.. ఎలా చేయాలో తెలుసా..?
కావలసిన పదార్థాలు: బాస్‌మతి రైస్ - 2 కప్పులు గోబీ పువ్వు - 1 ఉల్లిపాయ - 1 పచ్చిమిర్చి - 3 జీలకర్ర - 1 స్పూన్ కారం - 2 స్పూన్స్ దాల్చిన చెక్క - చిన్న ముక్క ఉప్పు - తగినంత నూనె - సరిపడా.. ఇంకా చదవండి.
కావలసిన పదార్థాలు:
బాస్‌మతి రైస్ - 2 కప్పులు
గోబీ పువ్వు - 1
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - 1 స్పూన్
కారం - 2 స్పూన్స్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
లవంగాలు - 3
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేసి వేడయ్యాక జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. కాసేపటి తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మరికాసేపు వేయించాలి. ఇప్పుడు గోబీ పువ్వును కట్ చేసి శుభ్రం చేసుకుని అందులో ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముందుగా తయారుచేసుకున్న మసాలాలో ఈ గోబీ పువ్వులు వేసుకుని కాసేపు వేయించుకుని ఉడికించుకున్న అన్నం ఆ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరు చల్లుకోవాలి. అంతే... వేడివేడి గోబీ పువ్వు పులావ్ రెడీ.