1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (14:58 IST)

ఒత్తిడికి దూరంగా ఉండండి.. మొటిమలకు చెక్ పెట్టండి!

అవునండి. ఒత్తిడిని దూరం చేసుకుంటే మొటిమలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు... మనస్సును ఆహ్లాదకరంగా ఉంచుకుంటే తప్పకుండా అందంగా కనిపిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహార పానీయాల్లో వచ్చిన తేడాలు, మానసిక ఒత్తిళ్లు వంటివే మొటిమలు ఏర్పడటానికి కారణం. ఇటీవల కాలంలో మానసిక ఒత్తిళ్ల వల్ల మొటిమలు రావటం బాగా పెరిగిందని పరిశోధనల్లో తేలింది.
 
మానసిక ఒత్తిళ్లు శరీరంలోని హార్మోన్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. దీని ప్రభావం వల్ల మొటిమలు వస్తాయి. అలాగే ఆహారంలో హార్మోన్లను కలపటం వల్ల కూడా మొటిమలు వస్తున్నాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ఆవులకు, గేదెలకు, బరువు పెరగటానికి కోళ్లకు ఇచ్చే ఆహారంలో హార్మోన్లు కలుపుతుంటారు. ఆ మాంసం తిన్న వారిలో సహజంగానే హార్మోన్‌పరమైన సమస్యలు మొదలై, అవి మొటిమలకు దారితీస్తాయి. 
 
అయితే ఒత్తిడిని తేలిగ్గా తీసుకుని అధిగమిస్తే తప్పకుండా మొటిమలను దూరం చేసుకోవచ్చును. ఒత్తిళ్లను అధిగమించే మానసిక పరిణతి కలిగివుండటమే గాకుండా, కనీసం క్రమం తప్పకుండా వ్యాయామం చేసేందుకు సమయం కేటాయిస్తే మొటిమలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.