బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 మే 2024 (20:14 IST)

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

anusuya - dhakshyani
anusuya - dhakshyani
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న చిత్రం పుష్ప2 ది రూల్. ఇందులో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి పార్ట్ లో దాక్షాయణి గా నటించింది. ఇప్పుడు ఆ పాత్రకు కొనసాగింపుగా వుండే పాత్ర ఇది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్టిల్ ను విడుదల చేసింది.
 
ఎర్రచందనం కలప వుండే చోట ఓ టేబుల్ పై ఆమె కూర్చుని పక్కనే మందు బాటిల్ తో దాక్షాయణి గా చమత్కారమైన యాసతో వుంది. నోటిలో గుట్కా నములే ఆమె ఈసారి మందు మింగుతున్నట్లుగా అనిపిస్తుంది. వెనుక ఆమె రౌడీలు వుండగా ఎవరితో సీరియస్ గా చూస్తున్న ఈ స్టిల్ నెటిజన్టను ఆకట్టుకుంది.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఇటీవలే కేరళ తదితర చోట్ల షూటింగ్ జరుపుకుంది. ఆగస్టు పదిహేనున స్వాతంత్య్ర దినోత్సవం నాడు సినిమాను విడుదల చేయనున్నారు.