శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (21:12 IST)

రష్మిక మందన్న పారితోషికం గురించి క్లారిటీ

Rashmika Mandanna
Rashmika Mandanna
తెలుగులో టాప్ హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న ఒకరు. ఆమద్య సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ తో మరింత పాపులర్ అయింది. ఇక అల్లు అర్జున్ తో నటించిన పుష్ప సినిమా హిట్ తో తన స్థాయి మరింత పెంచుకుంది. దానితో రష్మిక పారితోషికం బాగా పెంచేసిందని టాక్ వచ్చింది. దానికితోడు యానిమల్ సినిమా మరింత లాభం పొందింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దాని తర్వాత ఫుష్ప 2 సినిమా పారితోషికం పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
దానితో ఆమె తన పారితోషికంపై సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తన రెమ్యునరేషన్ ను దాదాపు 4 కోట్ల రూపాయలకి పైగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరోయిన్ మాట్లాడుతూ, రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఎవరు చెప్పారు. ఇవి చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా నిర్మాతలు  మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను  అని చెప్పింది. దాంతో పుకార్లకు క్లారిటీ ఇచ్చినట్లయింది.