1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By మనీల
Last Modified: శనివారం, 12 అక్టోబరు 2019 (13:39 IST)

ప్రసవం తర్వాత పెరిగిన బరువును తగ్గించుకోవడం ఎలా?

చాలా మంది మహిళల్లో ప్రసవం తర్వాత శారీరకంగా అనేక మార్పులను సంతరించుకుంటారు. ముఖ్యంగా విపరీతంగా బరువు పెరుగుతారు. ఈ బరువును తగ్గించుకునేందుకు ఆరంభంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవానికి ముందు ఉన్నట్టుగానే ఉండొచ్చని వైద్యులు చెపుతున్నారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 
 
ప్రసవం తర్వాత బిడ్డకు పాలివ్వాల్సి ఉండటం వల్ల ఆహార నియమ నిబంధనలు మాత్రం వైద్యుని సలహా మేరకు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రసరం తర్వాత ఆరోగ్యవంతమైన ఆహారమే తీసుకుంటారని, అందువల్ల అదనపు క్యాలరీల శక్తి శరీరంలో చేరే అవకాశం ఉందన్నారు. ఇది తల్లితో పాటు.. బిడ్డపై ప్రభావం చూపుతుందన్నారు. 
 
కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్యాల్షియంల వల్ల తల్లీబిడ్డలకు ఉపయోగకరంగా ఉంటుందని చెపుతున్నారు. అలాగే, ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటు బ్రిస్క్ వాక్ చేయాలని సలహా ఇస్తున్నారు.