తాళాల రంధ్రంలో గ్లిజరిన్ వేసుకుంటే?
గ్లిజరిన్‌ని అధికంగా సౌందర్య సాధాణకు వాడుతుంటారు. ఈ గ్లిజరిన్ ఉండే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ కాలంలో ఇంటికి గానీ, బీరువాలకు గానీ తాళాలు సరిగ్గా పడవు. అలాంటప్పుడు తాళం రంధ్రంలో రెండు చుక్కల గ్లిజర
గ్లిజరిన్‌ని అధికంగా సౌందర్య సాధాణకు వాడుతుంటారు. ఈ గ్లిజరిన్ ఉండే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ కాలంలో ఇంటికి గానీ, బీరువాలకు గానీ తాళాలు సరిగ్గా పడవు. అలాంటప్పుడు తాళం రంధ్రంలో రెండు చుక్కల గ్లిజరిన్‌ను వేసుకుంటే తాళం చక్కగా పనిచేస్తుంది.
మిగిలిపోయిన సబ్బు ముక్కలన్నింటిని ఓ సీసాలో వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు, గ్లిజరిన్ వేసుకుని హ్యాండ్ వాష్‌లా వాడుకోవచ్చును. ఈ నీటిని గాజు బుడగలుగా కూడా ఊదుకోవచ్చును. పువ్వుల వాజులోని పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా, సువాసనగా ఉండాలంటే ఆ నీటిలో కొద్దిగా గ్లిజరిన్ కలుపుకోవాలి.
చెక్క కిటికీలపై దుమ్ముతోపాటు మరకలు కూడా అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు పొడి వస్త్రంపై కొద్దిగా గ్లిజరిన్ వేసి తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.