ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (15:30 IST)

చలికాలంలో శిరోజాల రక్షణకు.. ఏం చేయాలి..?

చలి మొదలవుతోందంటేనే మహిళలకు కొత్త సమస్యలు. సీజనల్ సమస్యలలో భాగంగా చర్మం తెల్లబారిపోవడం, జుట్టు అందవిహీనంగా, నిస్తేజంగా మారిపోవడంతో చాలామందికి కొత్త దిగులు పుట్టడం ఖాయం. ఈ సమస్యల నుండి తప్పించుకోవాలంటే చలిగాలులు తీవ్రం కాకముందే సరైన సంరక్షణ చర్యలు చేపట్టక తప్పదు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
 
వారంలో కనీసం రెండు సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే శిరోజాలు జవజీవాలు సంతరించుకుంటాయి. చల్లగాలులు శిరోజాలను పొడి బారేటట్లు చేస్తాయి. కాబట్టి అలోవెరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి. శీతాకాలంలో బయటకు వెళ్లవలసి వస్తే తలకు ఊలు స్పార్క్ కంటే సిల్క్‌ స్పార్క్‌ మంచివి.
 
చలికాలం శిరోజాల రక్షణకు మొదటిది.. నీరు తగినంత తాగడమే. శరీరంలో నీరు లేకపోతే శిరోజాలు పిడచబారి పోవడం ఖాయం. దప్పిక వేయదు అని సాకు చూపి తగినన్ని నీళ్లు తాగకపోతే చర్మంతోపాటు శిరోజాలు కూడా పొడిబారిపోతాయి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన సమయం. కాబట్టి జుట్టు కొసలను తరచు కత్తిరించుకుంటూ ఉండాలి. 
 
చలికాలంలో డ్రయర్లను వాడొద్దు. మెత్తని తువాలుతో తుడుచుకుని, గాలికి ఆరనివ్వడం మంచిది. తీవ్రంగా చలువ చేసే హెర్బల్ నూనెలు వేసవికి పనికొస్తాయి తప్ప చలికాలానికి అనువుగా ఉండవు. కాబట్టి తలకు నూనెలు పట్టించేవారు చలికాలంలో ఎక్కువ సేపు నూనెను అలాగే ఉంచుకోరాదు.