వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్
Pupshpa collections poster
సినిమా కథానాయకుడిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ యూత్‌లో ఫాలోయింగ్‌నూ, కలెక్టన్లలో సునామీని, అభిమానుల్లో సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేలా ఎదిగిన వ్యక్తి అల్లు అర్జున్. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి ట్రెండ్లో ఆయనే ఆదర్శంగా నిలుస్తాడు. అందుకేనేమో ముందుగా తెలుసుకున్న దర్శకుడు సుకుమార్ ఆయనకు ఐకానిక్ స్టార్ బిరుదు కూడా ఇచ్చారు. అలాంటి కథానాయకుడు 2024లో కెరీర్లో నిలిచిపోయే తరాలకు గుర్తించేలా నిలిచారనే చెప్పాలి.
దానికి పుష్ప 2 సినిమా కేంద్రం కావడం ఓ విశేషం. ఇంతముందు హీరోలు బాహుబలి, ఆర్.ఆర్.ఆర్.లు చేసినా రాని కీర్తి అల్లు అర్జున్‌కు దక్కడం విశేషం. పుష్ప 2 చిత్రం 21 రోజుల్లో రూ.1705 కోట్లు కలెక్ట్ చేసిన తొలి భారతీయ చిత్రం ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్..కంటిన్యూగా సాగుతోంది. అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాన్ని కూడా అభిమానులు పట్టించుకోకుండా సినిమాను హిట్ చేయడం గ్రేట్.
ప్రేక్షకులకు కావాల్సింది వినోదమే. అందుకే పుష్ప 2 చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ సంథ్య థియేటర్ విషయంలో జైలుకు వెళ్ళినా కూడా సినిమాపై ఆదరణ తగ్గలేదు. ఇంకోవైపు అభిమానులు, సోషల్ మీడియా ఎంతగా నెగెటివ్‌గా ప్రచారం చేసినా అవేవీ సామాన్య పౌరుడికి ఒంటపట్టలేదని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇంతటి విజయాన్ని ఆస్వాదించుకున్నా అల్లు అర్జున్ బయటకు వచ్చి ఖుషీ చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇదంతా స్వయంకృపరాధంగా కొందరు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఎదిగేకొద్దీ ఒదిగి వుండాలనే సూత్రాన్ని తను పూర్తిగా మర్చిపోయాడనేది తేటతెల్లమవుతుంది.