ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:34 IST)

అన్నొస్తాడు.. మంత్రిపదవి ఇస్తాడంటున్న చెల్లెమ్మ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత ఎవరికి వారు తమ పార్టీ గెలుస్తుందని అంటే.. కాదు తమ పార్టీ గెలుస్తుందని మరికొందరు అంటున్నారు. మొత్తంమీద గెలుపుఓటములు అనేవి అధికార టీడీపీ, విపక్ష వైకాపాల మధ్యే ఉండనుంది. మూడో పార్టీగా ఎన్నికల గోదాలోకి దిగిన జనసేన మాత్రం అధికారంలోకి వచ్చే సూచనలు ఏమాత్రం లేవు. కానీ, ఈ పార్టీ ప్రభావం ఇతర పార్టీలపై ఏ మేరకు పడపోతుందన్న అంశంపైనే ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి నగిరి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే.రోజాకు చెల్లెలు వంటింది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే, ఎన్నికల ఫలితాలకు మరో నెల రోజులకు పైగా వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 
 
అయితే, మిగిలిన అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నా... నగరిలో మాత్రం తాను మాత్రం విజయభేరీ మోగిస్తానని వైకాపా అభ్యర్థి, సినీ నటి ఆర్కే.రోజా గట్టిగా ధీమాను వ్యక్తం చేస్తోంది. అంతేనా.. పార్టీ గెలువడంతో పాటు తనకు మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆమె కోటి ఆశలు పెట్టుకున్నారు. 
 
గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయినప్పుడు తన కేబినెట్‌లో సబితా ఇంద్రారెడ్డి‌కి హోమ్ మంత్రి పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెకి హోం మంత్రి పదవిని ఇచ్చినందుకు రాజశేఖర్ రెడ్డికి చాలా ప్లస్ అయ్యింది. మహిళలు రాజశేఖర్ రెడ్డి పట్ల మక్కువ చూపించడానికి అదో కారణమైంది. 
 
ఇక ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కూడా గెలవబోతున్నాడని ఆయాన మంత్రివర్గంలో తనకి మంత్రి పదవి ఇవ్వబోతున్నాడని రోజా భావిస్తుంది. జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే తనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఆమె నమ్మపలుకుతున్నారు.