మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:54 IST)

నవ్యాంధ్రపై దండయాత్ర చేస్తున్న కాలకేయుడు.. తస్మాత్ జాగ్రత్త : నారా లోకేష్

తన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని భల్లాల దేవుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోల్చడంపై టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేనా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాలకేయుడుతో పోల్చారు. గుజరాత్‌లో నరమేధం చేసిన నరేంద్ర మోడీ భల్లాల దేవుడికి సరిగ్గా సరిపోతారని అన్నారు. 
 
ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆరోపించారు. అలాంటి మోడీ... నవ్యాంధ్రపై కాలకేయుడులా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకున్నా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న చంద్రబాబు నాయుడు ఓ బాహుబలి లాంటివారని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రహ్మణి, భువనేశ్వరి ఉన్నారని లోకేశ్ వివరించారు.