శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (13:35 IST)

తెదేపా ఓడిపోతుంది... ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ప్రధాని మోదీ

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పరాజయం పాలవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్లో ఇలా ట్వీట్ చేశారు.

" ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడంలేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు'' అని పేర్కొన్నారు.