ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:10 IST)

ఆరు కాళ్లు, రెండు తలలతో జన్మించిన దూడ

కృష్ణా జిల్లాలో వింత చోటుచేసుకుంది. జిల్లాలోని పామర్రు గ్రామంలోని యాదవపురానికి చెందిన గోపాలకృష్ణకు చెందిన గేదె 10 నెలలు అవుతున్నా దూడను ఈనకపోవడంతో అనుమానంతో పశు వైద్యుడు వద్దకు తీసుకెళ్లారు.
 
పరీక్షలు నిర్వహించిన వైద్యుడు గేదె లోపల ఉన్న దూడ ఆకృతిలో తేడా ఉందని చెప్పాడు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించాడు. శస్త్ర చికిత్స చేసి దూడను బయటికి తీయగా ఆ దూడకి 2 తలలు, 6 కాళ్లు వున్నాయి. దూడను బయటకు తీసిన కొద్దిసేపటికే అది మృతి చెందింది.